బుధవారం, 18 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఆసియా-పసిఫిక్ ఉమ్మడి కుటుంబం నిర్మిద్దాం

13 నిమిషాల క్రితం

ఆసియా-పసిఫిక్ ఉమ్మడి కుటుంబం నిర్మిద్దాం
- ఏపెక్ సిఇఒల సదస్సులో జిన్‌పింగ్ పిలుపు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 12:39 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఏపెక్ సిఇఒల సదస్సులో జిన్‌పింగ్ పిలుపు

​షెన్‌జెన్ : ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార వేదిక (ఎపిఇసి) 33వ ఆర్థిక నేతల సమావేశం కోసం దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్ రాష్ట్రం, షెన్‌జెన్ నగరంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం ఏపెక్ సిఇఒ సదస్సు 2026 ప్రారంభమైంది. బుధవారం షెన్‌‌జెన్ విమానాశ్రయానికి చేరుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌‌నకు జిన్‌‌పింగ్ ఘన స్వాగతం పలికారు. అంతకుముందు రష్యా అధ్యక్షుడు పుతిన్‌‌తో జిన్‌‌పింగ్ భేటీ అయ్యారు. అనంతరం అతిథులకు స్వాగత విందు ఇచ్చారు. షెన్‌జెన్‌లో ప్రారంభమైన ఏపెక్ సిఇఒ సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆసియా-పసిఫిక్ దేశాలు శాంతి, సహకారం, స్వేచ్ఛా వాణిజ్యంతో ఉమ్మడిగా అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. చైనా 2026–2030 పంచవర్ష ప్రణాళిక ప్రపంచ పెట్టుబడిదారులకు కొత్త అవకాశాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. రెండు రోజుల సదస్సుకు ఏపెక్ సభ్య ఆర్థిక వ్యవస్థలతో పాటు ఇతర దేశాల నుంచి 2 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చిలీ అధ్యక్షుడు జోస్ ఆంటోనియో కాస్ట్, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం సహా ఏపెక్ ఆర్థిక వ్యవస్థల నేతలు హాజరయ్యారు. గతంలో 2001, 2014లో ఏపెక్ ఆర్థిక నేతల సమావేశాలకు ఆతిథ్యమిచ్చిన చైనా, ఈ ఏడాది మూడోసారి ఆ బాధ్యత చేపట్టింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్