ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ‘అక్వాన్’ తుపాను గంటకు 3 కిలోమీటర్ల వేగంతో నెమ్మదిగా ఉత్తర-వాయువ్య దిశగా కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టరు ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. చెన్నైకు 590 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 650, విశాఖపట్నానికి 660, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 780 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉందని తెలిపారు. గురువారం ఉదయానికి ‘అతి తీవ్ర తుపాను’గా బలపడే అవకాశం ఉందని అంచనా వేశారు. శుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు, విశాఖపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశముందని వెల్లడించారు. ఆ సమయంలో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వరకూ పెనుగాలులు వీచే అవకాశం ఉందని, గరిష్టంగా 145 కిలోమీటర్ల వేగంతో వీయొచ్చని తెలిపారు. తుపాను ప్రభావంతో గురు, శుక్రవారాల్లో కోస్తా జిల్లాల్లో పలుచోట్ల అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని తెలిపారు.
Print Editionరేపు అతి తీవ్ర తుపానుగా అక్వాన్..
10 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 18, 2026, 12:33 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)