మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకలిసి ముందుకు!

7 నిమిషాల క్రితం

కలిసి ముందుకు...!
-అంతర్జాతీయ చట్టాలను గౌరవిద్దాం
- సముద్రాలపై మరింత సహకారం 
- భారత్‌తో పాటు తూర్పు ఆసియా దేశాల సంయుక్త ప్రకటన image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026, 12:36 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

  • అంతర్జాతీయ చట్టాలను గౌరవిద్దాం

  • సముద్రాలపై మరింత సహకారం

  • భారత్‌తో పాటు తూర్పు ఆసియా దేశాల సంయుక్త ప్రకటన

మనీలా : ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ‘కలిసి ముందుకు’ సాగాలన్న సంకల్పాన్ని తూర్పు ఆసియా దేశాలు వ్యక్తం చేశాయి. ఆ దేశాల శిఖిరాగ్ర సమావేశం మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా ‘స్థిరమైన మన భవిష్యత్తు.. పునరుద్దరణ.. కోసం కలిసి ముందుకు’ శీర్షికతో సంయుక్త ప్రకటన విడుదలచేశారు. ఈ ప్రకటనలో సమద్ర భద్రత, వాణిజ్య అంక్షలు, పెరుగుతున్న ధరలు ఇలా పలు కీలకాంశాలను ప్రస్తావించారు. ఆగ్నేయాసియా (ఆసియాన్‌‌) దేశాల సమాఖ్యలోన సభ్య దేశాలైన ఫిలిప్పీన్స్‌ఇండోనేషియా , సింగపూర్‌ , థాయ్‌లాండ్‌ , బ్రూనై, కంబోడియా ,లావోస్‌ , వియత్నాం, తిమోర్‌-లెస్టే ,మలేషియా మయన్మార్‌‌లతో పాటు భారత్‌, అమెరికా, చైనా ,జపాన్‌ ,దక్షిణ కొరియా,ఆస్ట్రేలియా ,న్యూజిలాండ్‌ రష్యాలు ఈ తూర్పు ఆసియా దేశాల శిఖిరాగ్రసదస్సులో భాగస్వాములుగా పాల్గొన్నాయి. మనీలాలో జరిగిన ఆసియాన్‌ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా దాని అనుబంధంగా తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం నిర్వహించారు.శిఖారాగ్ర సదస్సు అనంతరం విడుదల చేసిన ప్రకటనలో 1982 నాటి ఐక్యరాజ్యసమితి సముద్ర చట్టాల ఒప్పందం (యూఎన్‌సిఎల్‌ఓఎస్‌)ను గౌరవించాల్సిన ప్రాధాన్యాన్ని నేతలు నొక్కిచెప్పారు. చట్టబద్ధమైన సముద్ర వాణిజ్యానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని, అంతర్జాతీయ చట్టాల ప్రకారం జలసంధుల గుండా రవాణా హక్కుతో పాటు సముద్రాలను చట్టబద్ధంగా వినియోగించుకునే ఇతర హక్కులను గౌరవించాలని పేర్కొన్నారు.సముద్ర వనరుల పరిరక్షణ, సముద్ర జీవవైవిధ్యం, పర్యావరణ వ్యవస్థల సంరక్షణ, సముద్ర కాలుష్యం, సముద్రాల్లో పేరుకుపోతున్న వ్యర్థాల నివారణకు పరస్పర సహకారాన్ని పెంచుకోవాలని ప్రకటన పిలుపునిచ్చింది. సముద్రగర్భంలో ఉన్న కేబుళ్లు, పైప్‌లైన్లు, ఇతర కీలక మౌలిక సదుపాయాలకు రక్షణ కల్పించాల్సిన అవసరాన్ని కూడా ప్రస్తావించింది.సముద్ర సహకారం, స్థిరత్వం, భద్రతతో పాటు వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం, నౌకాయానం, గగనతల ప్రయాణ స్వేచ్ఛను పరిరక్షించడం వంటి అంశాల ప్రాధాన్యాన్ని ప్రకటన ప్రత్యేకంగా పేర్కొంది.

ధరల అదుపుకోసం వాణిజ్య మార్గాలు తెరవాలి

ప్రాంతీయ ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని ఈ సదస్సులో పాల్గొన్న దేశాలు పిలుపునిచ్చాయి. నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాలతో సహా వివిధ వస్తువుల ధరలు అనూహ్యంగా పెరుగుతున్న నేపధ్యంలో కొరత లేకుండా చూసేందుకు వాణిజ్య మార్గాలు తెరిచి ఉంచాలని తీర్మానంలో పేర్కొన్నారు. . కీలక ఖనిజాలతో సహా సరఫరా వ్యవస్థలు అంతరాయాలను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. వాణిజ్యానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవడానికి చర్చలు, నిర్మాణాత్మక సంప్రదింపులు అవసరమని ప్రకటన పేర్కొంది. వాణిజ్యంలో పారదర్శకత, ముందస్తు అంచనాలకు అనుగుణమైన విధానాలను మెరుగుపరచడం ద్వారా ప్రాంతీయ ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయాలని సూచించింది. వాయు, భూ, సముద్ర మార్గాల్లో అనుసంధానాన్ని మరింత విస్తరించాలని నేతలు పిలుపునిచ్చారు. ఇంధన రంగంలో దేశాల మధ్య అనుసంధానాన్ని పెంచడంతోపాటు, విశ్వసనీయమైన, అంతరాయాలను తట్టుకోగల మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహకరించాలని సూచించారు.డిజిటల్‌ సాంకేతికతలు, కృత్రిమ మేధస్సు (ఏఐ), శాస్త్రసాంకేతిక పరిశోధనలు, ఆవిష్కరణల వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ప్రాంతీయ సహకారాన్ని విస్తరించాలని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ మోసాలు, దోపిడీ, మనుషుల అక్రమ రవాణా, ఇంటర్నెట్‌ ద్వారా జరిగే లైంగిక వేధింపులు, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు సమన్వయంతో చర్యలు చేపట్టాలని ముఖ్యంగా పిల్లలు, ఇతర బలహీన వర్గాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని జరిగే నేరాలను ఐక్యంగా నియంత్రించా లని ఈ దేశాలు పేర్కొన్నాయి. ఇంధన భద్రత, ఆహార భద్రత, ఆరోగ్య వ్యవస్థల స్థిరత్వం, విపత్తుల సన్నద్ధత, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, వలస కార్మికుల రక్షణ వంటి అంశాల్లోనూ సహకారాన్ని బలోపేతం చేయాలని నేతలు పేర్కొన్నారు.

శాంతియుత, సుస్థిర, సంపన్న ఇండో-పసిఫిక్‌ లక్ష్యం : మోడీ

శాంతియుతమైన, సుస్థిరమైన, సంపన్నమైన ఇండో-పసిఫిక్‌ ప్రాంతం భారత్‌ ఆకాంక్ష అని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పునరుద్ఘాటించారు. తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించిన ఆయన ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లను పరిష్కరించడంలో చర్చలు, దౌత్యానికి ఎంతో ప్రాధాన్యం ఉందని స్పష్టం చేశారు. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో భద్రత, రక్షణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు అత్యంత కీలకమైన వేదికగా కొనసాగుతోందని చెప్పారు. ప్రాంతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్