మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionతుపాన్లతో దెబ్బతిన్నాం తక్షణ సాయం అందించండి

19 నిమిషాల క్రితం

913432910_2046695092704669_5172284033443601408_n_resized.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026, 12:21 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సిఎం చంద్రబాబు

ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఇటీవ‌ల వ‌చ్చిన‌ రెండు భారీ తుపాన్ల తాకిడితో పంటలు సహా వివిధ రంగాలకు భారీ నష్టం సంభవించిందని, రాష్ట్రానికి తక్షణ ఆర్థిక సాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజ్ఞ‌ప్తి చేశారు. మంగ‌ళ‌వారం నాడిక్క‌డ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సిఎం చంద్ర‌బాబు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇటీవల సంభవించిన వరుస తుపాన్లు, హార్టికల్చర్ హబ్, పూర్వోదయ నిధులు విడుదల, ప్రాంతాల వారీ అభివృద్ధి ప్రణాళికలు వంటి అంశాల గురించి చర్చించారు. అలాగే విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు, తీసుకున్న నిర్ణయాలపై ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా రాష్ట్రాన్ని ఇటీవల కాలంలో తాకిన అర్నబ్, మురసు తుపాన్ల వల్ల కలిగిన నష్టం గురించి కేంద్ర మంత్రికి సిఎం చంద్రబాబు వివరించారు. ఈ రెండు తుపాన్ల వల్ల ప్రాథమిక అంచనా ప్రకారమే సుమారు రూ.7 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు తెలిపారు. తుపాను ముప్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. చేతికందే పంట నీటి పాలైందని పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావం ఉన్నా, రైతులను గట్టెక్కించేందుకు పట్టిసీమతో కొన్ని ప్రాంతాలకు సాగు నీరందించామని, కానీ తుపాన్ల తాకిడితో పంటలు వేసుకున్న రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. దీంతో పాటు.. తీర ప్రాంతంలో మౌలిక వసతులు భారీ ఎత్తున దెబ్బతిన్నాయని, ముఖ్యంగా విద్యుత్ వ్యవస్థ ఎక్కువగా నష్టపోయిందని తెలిపారు. రాష్ట్రానికి తుపాన్ల వల్ల కలిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తక్షణ ఆర్థిక సాయం అందించాలని కోరారు. అర్నబ్, మురసు తుపాన్ల వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలు రాష్ట్రంలో పర్యటించాయని, వారు కూడా వీలైనంత త్వరలో నివేదిక సమర్పిస్తార‌ని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తక్షణ సాయం అందించగలిగితే కొంత మేర ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని చంద్ర‌బాబు పేర్కొన్నారు.

ప్రాంతాల వారీ అభివృద్ధి ప్రణాళికలు

కేంద్ర ఆర్థికశాఖ మంత్రితో జరిగిన భేటీలో రాష్ట్రంలో చేపడుతోన్న అభివృద్ధి ప్రణాళికల అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. విశాఖ, అమరావతి, తిరుపతి రీజియన్ల వారీ ఆర్థికాభివృద్ధికి ప్రణాళికలు చేపట్టినట్లు సిఎం చంద్రబాబు తెలిపారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్‌కు ఇప్పటికే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. హార్టికల్చర్ హబ్‌లో భాగంగా వివిధ స్థాయిల్లో మౌలిక వసతుల అభివృద్ధి చేపడుతున్నామని చెప్పారు. గ్రామాలకు


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్