ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లందరినీ రెగ్యులర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్టు లెక్చరర్ల అసోసియేషన్ కోరింది. ఈ మేరకు ఆ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వై జాన్ బాబు, జిఎల్ మాణిక్యం, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 2000 సంవత్సరం నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కాంట్రాక్టు లెక్చరర్లుగా నియమించారని తెలిపారు. అనేక పోరాటాలు, ప్రాతినిధ్యాలు చేయడంతో గత ప్రభుత్వం క్రమబద్ధీకరణ కోసం జివో 114ను విడుదల చేసిందని, ఆ ప్రకారం 3,618 మంది అర్హులుగా గుర్తించిందని తెలిపారు. ఎన్నికల కోడ్ రావడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయిందని పేర్కొన్నారు. ప్రభుత్వం తిరిగి ఆ ప్రక్రియను ప్రారంభించిందని తెలిపారు. కానీ ప్రభుత్వం, అధికారులు మాత్రం క్రమబద్ధీకరణకు కొందరే అర్హులని చెబుతున్నారని, దీంతో కాంట్రాక్టు లెక్చరర్లు తీవ్ర మానసిక ఆందోళనలో ఉన్నారని వివరించారు. ఈ విషయంపై ప్రభుత్వ అధికారులు పూర్తి వివరణ ఇవ్వాలని కోరారు.
కాంట్రాక్టు లెక్చరర్లందరినీ రెగ్యులర్ చేయాలి
02 ఆగస్టు, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 02, 2026, 09:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)