ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కూటమి, వైసిపి పరస్పర దాడులు

40 నిమిషాల క్రితం

కూటమి, వైసిపి పరస్పర దాడులు 
            -పలువురికి గాయాలు  
            -వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో ఉద్రిక్తత image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026, 09:07 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

-పలువురికి గాయాలు

-వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో ఉద్రిక్తత

ప్రజాశక్తి-యంత్రాంగం : పంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్ల సందర్భంగా వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలో రెండో రోజు ఆదివారం కూడా ఉద్రిక్తత చోటుచేసుకుంది. కూటమి శ్రేణుల, వైసిపి శ్రేణుల పరస్పర దాడుల్లో పలువురు గాయాలపాలయ్యారు. పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నించిన సిఐకు, ఎస్‌ఐకు, పోలీసులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. నామినేషన్‌ ‌వేసేందుకు కొండాపురం మండలం ఓబన్నపేట పంచాయతీకి చెందిన చౌటిపల్లి, గండ్లూరు, ఓబన్నపేట గ్రామాల వైసిపి మద్దతుదారులు కొండాపురం జిల్లా పరిషత్‌ ‌హైస్కూల్‌‌లో ఏర్పాటు చేసిన నామినేషన్‌ ‌కేంద్రానికి బయలుదేరారు. వారిని కిలోమీటరు దూరంలోనే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, వైసిపి నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆ సమయంలో గండ్లూరు గ్రామానికి చెందిన వైసిపి నాయకుడు పాముగారి నారాయణరెడ్డి అనుయాయులు, అదే గ్రామానికి చెందిన టిడిపి నాయకుడు బాలవెంకటగారి శంకర్‌‌రెడ్డి అనుయాయుల మధ్య జరిగిన వాగ్వివాదం ఘర్షణకు దారి తీసింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తేవడానికి ప్రయత్నించిన కమలాపురం సిఐ మోహన్‌, కొండాపురం ఎస్‌ఐ సూర్యనారాయణరెడ్డికి రాళ్లు తగిలి స్వల్పగాయాలయ్యాయి. సోమవారం నామినేషన్లు వేయిస్తామని వైసిపి అభ్యర్థులకు పోలీసులు హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగారు. వైసిపి నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నామినేషన్‌ ‌వేయడానికి ముద్దనూరు గ్రామ పంచాయతీ కార్యాలయానికి వచ్చిన తిమ్మాపురం గ్రామానికి చెందిన వైసిపి అభ్యర్థులు, నాయకులను కూటమి నాయకులు అడ్డుకొని నామినేషన్‌ ‌పత్రాలను లాక్కొని పోలీసుల సమక్షంలోనే చించివేశారు. పోలీసులు కూటమి నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వైసిపి అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగపట్నం క్లస్టర్‌‌కు సంబంధించి కొర్రపాడు, గంగాదేవిపల్లి, శెట్టివారిపల్లె, ఓబులాపురం గ్రామాలకు వైసిపి అభ్యర్థులతో పోలీసులు మంగపట్నం నామినేషన్‌ ‌కేంద్రంలో నామినేషన్లు వేయించారు. దీన్ని సహించని కూటమి నాయకులు గంగాదేవిపల్లిలోని వైసిపి నాయకుల ఇళ్లకు వెళ్లి కర్రలు, రాళ్లతో దాడులు చేశారు. దీంతో, వైసిపి నాయకులు భాస్కర్‌‌రెడ్డి, మూలరెడ్డి, వెన్నపూస రమణారెడ్డి చంద్రమోహన్‌ ‌గాయపడ్డారు. ఖాజీపేట మండం బి.కొత్తపల్లి పంచాయతీకి సంబంధించి టిడిపి మద్దతుదారుడు ముత్తూరు రఘురామిరెడ్డి నామినేషన్‌ ‌వేసేందుకు మిడతూరులో ఏర్పాటు చేసిన నామినేషన్‌ ‌కేంద్రానికి వెళ్తుండగా వైసిపికి చెందిన వారు అడ్డుకున్నారు. దీంతో, మాటామాటా పెరిగి జరిగిన ఘర్షణలో ఆయనకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఖాజీపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గొడవను అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులకూ స్వల్ప గాయాలయ్యాయి.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్