ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వీధి నిరసనల నుండి ఉద్యమాలకు...

52 నిమిషాల క్రితం

cjp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026, 08:52 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- యువత భాగస్వామ్యాన్ని పెంచేలా ‘కాక్రోచ్‌ క్లబ్‌’

- సిజెపి నేత అశుతోష్‌ రాంకా

న్యూఢిల్లీ : వీధి నిరసనలకు మించి యువత ఉద్యమాలను నిర్వహించేలా, వారిని అందులో భాగస్వాములను చేసేలా కాక్రోచ్‌ ‌జనతా పార్టీ (సిజెపి) చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కొత్తగా ప్రారంభించిన కాక్రోచ్‌ ‌క్లబ్‌‌ ద్వారా సాంస్కృతిక, చర్చా వేదికలతో కూడిన దేశవ్యాప్త నెట్‌‌వర్క్‌‌ను నిర్మించాలని భావిస్తోంది. ఈ చొరవ దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతాలకూ చేరాలని కోరుకుంటోంది. తద్వారా ప్రజా సమస్యలను చర్చించడానికి, పరస్పరం అభిప్రాయాలను మార్పిడి చేసుకోవడానికి, భవిష్యత్తులో భారతదేశాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో ఆ దార్శనికతను పంచుకోవడానికి ఒక వేదికను యువతకు ఇవ్వాలని సిజెపి భావిస్తోందని కో కన్వీనర్‌ అశుతోష్‌ ‌రాంకా తెలిపారు. హిందూ పత్రికతో మాట్లాడుతూ ఆయన తన అభిప్రాయాలు పంచుకున్నారు.

కాక్రోచ్‌ ‌క్లబ్‌ ఈ నెల 21న పూనేలో ‘బాపూ వారసత్వం’ అనే శీర్షికతో మొదటిసారిగా సమావేశం జరిపింది. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో 300మందికి పైగా పాల్గొన్నారు. మహారాష్ట్రకు సంబంధించిన స్థానిక సమస్యలను ఇందులో చర్చించారు. పెద్ద సమస్యలను ప్రస్తావిస్తూ కొన్ని కార్యక్రమాలను కూడా ప్రదర్శించారు. ఈ క్లబ్‌‌లను దేశవ్యాప్తంగా విస్తరించాలని సిజెపి భావిస్తోంది. ఈ క్లబ్‌‌ల్లో చదవడానికి, అధ్యయనం చేయడానికి, పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి అవసరమైన సదుపాయాలు కూడా వుంటాయి.

యువతలో స్వతంత్ర ఆలోచనా శక్తిని ప్రోత్సహించడం, యువత శక్తియుక్తులను, సామర్ధ్యాలను దేశ భవిష్యత్‌‌ను తీర్చిదిద్దంగంలో ఉపయోగపడేలా చూడడం ఈ చొరవ ముఖ్య ఉద్దేశ్యాలని కో కన్వీనర్లు అశుతోష్‌ ‌రాంకా, సౌరవ్‌ ‌దాస్‌‌లు చెప్పారు. ఈ క్లబ్‌ ‌ద్వారా కార్యక్రమాలు విస్తృతమయ్యే కొద్దీ అవసరమైన నిధులను ఎలా సేకరించాలనే దానిపై కూడా పార్టీ యోచిస్తోంది. స్థానికంగా నిధుల సమీకరణతో పాటూ భవిష్యత్తులో టిక్కెట్లు కొనుక్కొని చూడదగ్గ కార్యక్రమాలు చేపట్టడం సహా నిధుల సమీకరణకు గల ఇతర మార్గాలను పార్టీ అన్వేషిస్తోందని వారు తెలిపారు. భవిష్యత్‌ ‌కార్యక్రమాలు ఏ తరహాలో వుండాలో కూడా చర్చిస్తున్నామన్నారు.

​నిరుద్యోగం, పరీక్షా వ్యవస్థలో అవకతవకలు, అవకాశాల లేమి వంటి సమస్యలపై యువతతో కలిసి నిరసనలు చేపట్టడం ద్వారా సిజెపి అందరి దృష్టిని ఆకర్షించింది. యువతనందరినీ ఒక చోటకు చేర్చేందుకు, వారిని ప్రజా సమస్యల పరిష్కారంలో కూడగట్టేందుకు కాక్రోచ్‌ ‌క్లబ్‌ ‌విస్తృంగా కృషి చేస్తుందని సిజెపి తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్