ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వైభవంగా ముగిసిన వైజాగ్ జూనియర్ లిటరరీ ఫెస్ట్

16 నిమిషాల క్రితం

వైభవంగా ముగిసిన వైజాగ్ జూనియర్ లిటరరీ ఫెస్ట్ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026, 09:28 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

విశాఖ: చిన్నారుల్లో పుస్తక పఠనంపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు సృజనాత్మకతను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించిన వైజాగ్ జూనియర్ లిటరరీ ఫెస్ట్ ఆదివారం ఘనంగా ముగిసింది. నవంబర్ 21న హవామహల్‌లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్‌నాయుడు ప్రారంభించిన ఈ సాహిత్య వేడుక రెండు రోజులపాటు సందడిగా సాగింది. రెండు రోజుల్లో మొత్తం 3,700 మంది సందర్శకులు పాల్గొన్నారు. నాలుగు నుంచి 16 ఏళ్ల వయసున్న చిన్నారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఉత్సవంలో మొత్తం 50 కార్యక్రమాలు నిర్వహించారు. చివరిరోజు హవామహల్ ప్రాంగణంలోని ఏడు వేదికలపై ఒకేసారి ఏడు కార్యక్రమాలు జరిగాయి. చిన్నారులతో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ఇతర వయసుల వారికి ఉపయోగపడేలా మూడు వయో విభాగాల్లో కార్యక్రమాలను రూపొందించారు. ఈ ఉత్సవంలో 20 మంది ప్రముఖ వక్తలు, రచయితలు పాల్గొన్నారు. సంజయ్ అరోరా, శ్వేతా తనేజా, వికాస్ ప్రకాశ్ జోషి, మేనకా రామన్, వర్షా శేషన్, అనుష్క రవిశంకర్ తమ పుస్తకాల గురించి వివరించారు. చిత్రకారులు కనాటో జిమో, సోనాల్ గుప్తా వాస్వానీ, మౌనిక తాతా నిర్వహించిన కార్యక్రమాలు చిన్నారులను ఆకట్టుకున్నాయి. కథకులు ఆకాంక్ష దత్తా, వినీతా జుట్షి, వనితాషా, నేహాసింగ్, లోపాముద్ర మొహంతి కథలతో ప్రేక్షకులను అలరించారు. ఒడిస్సీ నృత్య ముద్రలతో దశావతారాలను ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మోనికా తాతా సంగీతం, గణితాన్ని మేళవించి ఆసక్తికర కార్యక్రమాన్ని నిర్వహించారు. తల్లిదండ్రులకు పిల్లల పెంపకం, వారితో అనుబంధం వంటి అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సంజయ్ అరోరా సెషన్లు చిన్నారులతో పాటు పెద్దలను కూడా ఆకట్టుకున్నాయి. చివరగా మైమ్ కళాకారుడు కునాల్ మోట్లింగ్, విదూషకుడు రాహుల్ సంయుక్త ప్రదర్శనతో ఉత్సవం ముగిసింది. భారతీయ ప్రచురణ కర్తలకు చెందిన వెయ్యికి పైగా పుస్తకాలతో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు తమ అభిమాన రచయితలను నేరుగా కలుసుకుని, వారి పుస్తకాలపై సంతకాలు తీసుకోవడం ఆనందం కలిగించింది. ఉత్సవ నిర్వాహకులు సోనాల్ సర్దా, ప్రియా గోపాలకృష్ణన్, సంధ్యా గోడే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

​

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్