ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిపిఎం నేత, కేరళం మాజీ సిఎం ఇఎంఎస్‌ కుమార్తె రాధ కన్నుమూత

21 నిమిషాల క్రితం

ems
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026, 08:03 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తిరువనంతపురం: కమ్యూనిస్టు యోధులు, కేరళం మాజీ ముఖ్యమంత్రి ఇ.ఎం.ఎస్‌.నంబూద్రిపాద్‌ కుమార్తె ఇ.ఎం.రాధ(70) ఆదివారం కన్నుమూశారు. తిరువనంతపురంలోని ఆస్పత్రిలో ఆమె కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు. ఇఎంఎస్‌ ‌నలుగురు పిల్లల్లో రాధ అందరికంటే చిన్నవారు. కేరళ రాష్ట్ర వృద్ధుల కమిషన్‌ సభ్యురాలిగా ఆమె వున్నారు. గతంలో ఆమె రాష్ట్ర మహిళా కమిషన్‌‌ సభ్యురాలిగా కూడా పనిచేశారు. సుదీర్ఘకాలంగా సిపిఎం సభ్యురాలిగా వున్న ఆమెకు దేశాభిమాని పత్రికతో విస్తృతమైన అనుబంధం వుంది. 1981లో సీనియర్‌ ‌క్లర్క్‌‌గా ఆమె అందులో చేరారు. 2012లో ఆమె అడ్మినిస్ట్రేషన్‌ ‌విభాగ మేనేజర్‌‌గా పదవీ విరమణ చేశారు. సామాజిక, సాంస్కృతిక రంగాల్లో ఆమె చాలా చురుకుగా వ్యవహరించేవారు. తన తండ్రిపై ‘ఇఎంఎస్‌ : కుమార్తెగా జ్ఞాపకాలు’ అనే పుస్తకాన్ని రచించారు.

రాధ మృతి వార్త తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి వి.డి.సతీశన్‌, ప్రతిపక్ష నేత పినరయి విజయన్‌‌లు సంతాపం తెలియచేశారు. మహిళా కమిషన్‌, వృద్ధుల కమిషన్‌ ‌సభ్యురాలిగా ఆమె సామాజిక, సాంస్కృతిక రంగాల్లో అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. ఇఎం.రాధ తన నిరాడంబరతతో, స్పష్టమైన రాజకీయ వైఖరితో అందరిలోకి విశిష్టంగా నిలిచారని విజయన్‌ ‌పేర్కొన్నారు. ఆమె మృతి వామపక్ష ఉద్యమానికి, మొత్తంగా సమాజానికి తీరని లోటని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్