ఆదివారం, 22 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బాలకృష్ణ పిఎ కంపెనీలో మారణాయుధాలు

31 నిమిషాల క్రితం

బాలకృష్ణ పిఎ కంపెనీలో మారణాయుధాలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 22, 2026, 09:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​-స్వాధీనం చేసుకొన్న పోలీసులు

-పావులూరి శ్రీనివాసరావు సహా 66 మందిపై నాన్‌ బెయిల్‌‌బులు కేసులు

-టిడిపిలో బయటపడ్డ విభేదాలు

ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : మారణాయుధాలు కలిగి ఉన్న ఆరోపణలపై పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిఎ పావులూరి శ్రీనివాసరావుతో సహా 66 మందిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకొని నాన్‌ బెయిల్‌‌బుల్‌ ‌కేసులు నమోదు చేశారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుకు, పావులూరి శ్రీనివాసరావుకు మధ్య ఉన్న విభేదాల నేపథ్యంలో తిమ్మాపురం సర్పంచు స్థానానికి టిడిపి మద్దతుదారులుగా ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. పత్తిపాటి అనుచరుడు నాగళ్ల రాంబాబు, పావులూరి శ్రీనివాసరావు బంధువు పావులూరి పిచ్చయ్య నామినేషన్లు వేశారు. ఈ ఎన్నికలను పుల్లారావుకు, శ్రీనివాసరావు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తిమ్మాపురం గ్రామంలోగల శ్రీనివాసరావుకు చెందిన జిన్నింగ్‌ ‌కంపెనీలో మారణాయుధాలు ఉన్నాయంటూ పోలీసులకు పుల్లారావు అనుచరులు సమాచారమిచ్చారు. పోలీసుల సోదాలో ఈ కంపెనీలో కర్రలు, కత్తులు దొరకడంతో వాటిని స్వాధీనం చేసుకొని శ్రీనివాసరావుతోపాటు గ్రామానికి చెందిన ఆయన అనుచరులు 66 మందిని అరెస్టు చేసి నాదెండ్ల పోలీసు స్టేషన్‌‌కు తరలించి నాన్‌‌బెయిల్‌‌బుల్‌ ‌కేసులు నమోదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది గుంటూరు నుంచి 25 కార్లలో వచ్చి పోలీస్‌ స్టేషన్‌ వద్ద హల్‌‌చల్‌ చేశారు. పోలీసులు లాఠీఛార్జి చేసి వారిని చెదరగొట్టి 25 కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎఎస్‌‌పి ఎం.హనుమంతరావు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్