సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ సమస్యపై సీనియర్ నటి రమ్యకృష్ణ స్పందించారు. చిత్ర పరిశ్రమలోనే కాకుండా అన్ని రంగాల్లోనూ ఇలాంటి వేధింపులు ఉన్నాయని, గతంలోనూ, ఇప్పుడూ, భవిష్యత్తులోనూ ఇవి కొనసాగుతాయని ఆమె అభిప్రాయపడ్డారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఎప్‌స్టీన్ ఫైల్స్ వంటి ఉదంతాలు బయటపడ్డాయని గుర్తుచేశారు. గ్లామర్ ప్రపంచం కావడంతో సినీ పరిశ్రమలో ఈ అంశంపై ఎక్కువ చర్చ జరుగుతోందని అన్నారు. గతంలో కథానాయికలు షూటింగ్ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను కూడా ఆమె ప్రస్తావించారు. అప్పట్లో సెట్లలో వాష్‌రూమ్‌లు, క్యారవాన్లు ఉండేవి కావని, దుస్తులు మార్చుకోవడానికి కూడా తగినంత ప్రైవసీ లభించేది కాదని చెప్పారు. అంబాసిడర్ కార్లలో కూర్చుని బాటిళ్లలో మూత్ర విసర్జన చేయాల్సిన పరిస్థితులు ఉండేవని గుర్తుచేశారు. గతంతో పోలిస్తే ఇప్పటి నటీనటులకు షూటింగ్ ప్రదేశాల్లో మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు.
కాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ వ్యాఖ్యలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 17, 2026, 08:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)