మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నామినేషన్‌ తిరస్కరణతో ఉద్రిక్తత: ఆర్‌‌డిఒకు అప్పీలు చేస్తామన్న మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి

1 గంట క్రితం

నామినేషన్‌ తిరస్కరణతో ఉద్రిక్తత
ఆర్‌‌డిఒకు అప్పీలు చేస్తామన్న మాజీ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 08:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల పరిశీలన సందర్భంగా నరసరావుపేట పట్టణంలోని నామినేషన్ల కేంద్రం వద్ద మంగళవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. 14వ వార్డు వైసిపి అభ్యర్థి చింతా వెంకట వీరమ్మ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించడంతో వివాదం తలెత్తింది. తొలుత నామినేషన్‌ సక్రమంగానే ఉందని చెప్పిన అధికారులు, అనంతరం తిరస్కరించడం ఏమిటంటూ వైసిపి నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నామినేషన్ల కేంద్రానికి చేరుకుని నామినేషన్‌ తిరస్కరణకు గల కారణాలను అసిస్టెంట్‌ ఎన్నికల అధికారి, మున్సిపల్‌ కమిషనర్‌ బి.రమ్య కీర్తనను అడిగారు. ఓటరు గుర్తింపు కార్డులో అభ్యర్థి పేరు వీరమ్మ లక్ష్మీశెట్టిగా, ఆధార్‌ కార్డులో చింతా వెంకట వీరమ్మగా ఉందని, నామినేషన్‌ పత్రాల్లోనూ చింతా వెంకటవీరమ్మ పేరుతో దాఖలు చేయడంతో పేరు విషయంలో వ్యత్యాసం ఉన్న కారణంగా నామినేషన్‌ తిరస్కరించినట్లు కమిషనర్‌ వివరించారు. అనంతరం విలేకర్లతో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నామినేషన్‌ పత్రాలను పరిశీలించిన సమయంలో అభ్యంతరం లేదని చెప్పి అభ్యర్థుల నుంచి సంతకాలు తీసుకున్న తర్వాత తిరస్కరణ ప్రకటించడం అన్యాయమన్నారు. స్థానిక టిడిపి నాయకుడు వాసిరెడ్డి రవీంద్ర సూచనల మేరకే నామినేషన్‌ తిరస్కరించారని ఆరోపించారు. నామినేషన్‌ పత్రాలను చూపించాలని కోరినా అధికారులు చూపించడం లేదని, ఈ వ్యవహారంపై ఆర్డీవోకు అప్పీలు చేస్తామని అన్నారు. ఒకవేళ నామినేషన్‌ తిరస్కరణను సమర్థించినా, అదే సామాజిక తరగతికి చెందిన మరో మహిళను అభ్యర్థిగా నిలబెట్టి బీఫాం ఇస్తామన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్