ఆదివారం, 25 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అర్నబ్‌ తుపాను ముప్పు.. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

1 గంట క్రితం

ap
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026, 12:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : అర్నబ్‌ తుపాను ముప్పు నేపథ్యంలో రాష్ట్రంలోని అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. రానున్న ఐదు రోజులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. సోమవారం నుంచి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చని తెలిపారు. బుధవారం బాపట్ల-విశాఖపట్నం తీరాల మధ్య తుపాను తీరం దాటే అవకాశముందని, ఆ సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. ప్రమాదకరంగా ఉన్న హోర్డింగులను తక్షణమే తొలగించాలని, అవసరమైతే తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచాలని తెలిపారు. తుపాను ప్రభావం తగ్గే వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని, బీచ్‌లలోకి పర్యాటకులను అనుమతించవద్దని స్పష్టం చేశారు. సముద్రంలో అలలు ఉధృతంగా ఎగసిపడే ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకోవడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైతులు, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్