సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

చెకుముకి పరీక్షల్లో జిల్లా స్థాయికి ఎంపికైన ఏపీ ఆదర్శ పాఠశాల విద్యార్థులు

11 సెప్టెంబర్, 2026

vzm-1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 04:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి -వేపాడ : వేపాడ మండలం బక్కు నాయుడుపేటలోని ఏపీ ఆదర్శ పాఠశాల విద్యార్థులు చెకుముకి పరీక్షల్లో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఇటీవల బక్కు నాయుడుపేట ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన చెకుముకి పరీక్షల్లో 110 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో వి. మైదిలి, ఎస్. జోసన్‌, యు. లలిత మండల స్థాయి పరీక్షలకు ఎంపికయ్యారు. మండల స్థాయి చెకుముకి పరీక్షలను సెప్టెంబరు 11న వేపాడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన ముగ్గురు విద్యార్థులు జిల్లా స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల కెమిస్ట్రీ ఉపాధ్యాయుడు వరప్రసాద్‌ తెలిపారు. జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్‌ రావాడు ఈశ్వరరావు, ఉపాధ్యాయులు అభినందించారు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఫిజిక్స్‌ ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్