అమరావతి : ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన సీనియర్ ఐఎఎస్ అధికారి వి.ప్రసన్న వెంకటేష్ కు జాతీయ స్థాయిలో కీలక పదవి లభించింది. కేంద్ర ఉన్నత విద్యాశాఖ పరిధిలోని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) డైరెక్టర్‌గా వెంకటేష్ ను నియమించినట్లు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (DoPT) ఉత్తర్వులు జారీ చేసింది. సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్ కింద ప్రసన్న వెంకటేష్ ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. 2012 బ్యాచ్ ఐఎఎస్ అధికారి అయిన ఆయన .... గతంలో ఆంధ్రప్రదేశ్‌లో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఏలూరు జిల్లా కలెక్టర్‌గా, విజయవాడ మున్సిపల్ కమిషనర్‌గా ఆయన సేవలందించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రవేశ, అర్హత పరీక్షలను నిర్వహించే ఎన్టిఎ వంటి కీలక సంస్థకు డైరెక్టర్‌గా నియమితులు కావడం ద్వారా, కేంద్ర ప్రభుత్వం ఆయనకు మరో ముఖ్యమైన బాధ్యతను అప్పగించినట్లయింది. ఎపి కేడర్ అధికారికి జాతీయ స్థాయిలో ఈ పదవి దక్కడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎన్టిఎ డైరెక్టర్ గా ఎపి కేడర్ ఐఎఎస్ అధికారి నియామకం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 28, 2026, 12:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు





కామెంట్‌లు (0)