శుక్రవారం, 28 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

సిఎం రేవంత్ రెడ్డికి రాఖీలు కట్టిన సీతక్క, కొండా.సురేఖ

1 గంట క్రితం

Seethakka and Konda Surekha tied Rakhis to CM Revanth Reddy.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 28, 2026, 01:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తెలంగాణ : రాఖీ పౌర్ణమి పండగ సందర్భంగా .... తెలంగాణ రాష్ట్ర మహిళామణులకు సిఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో ఆత్మీయ వాతావరణం నెలకొంది. రాష్ట్ర మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఈరోజు ఉదయం సిఎం నివాసానికి చేరుకున్నారు. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుదుట తిలకం దిద్ది ఆయనకు రాఖీలు కట్టారు. అనంతరం సిఎంతో పాటు ఇద్దరు మంత్రులు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సిఎం‌ కు రాఖీ కట్టిన వారిలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ గద్వాల విజయలక్ష్మి, సభ్యులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, బ్రహ్మకుమారీలు, మహిళా కాంగ్రెస్ నాయకులు, మలక్‌పేట్‌లోని గవర్నమెంట్ హైస్కూల్ ఫర్ ది బ్లైండ్ గర్ల్స్ విద్యార్థినులు ఉన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్