శుక్రవారం, 04 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రాష్ట్ర మహాసభలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించిన ఏపీడబ్ల్యూజేఎఫ్ నేతలు

1 గంట క్రితం

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడునీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(APWJF) నేతలు సచివాలయంలో  కలిశారు.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 04, 2026, 03:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడునీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(APWJF) నేతలు సచివాలయంలో కలిశారు. ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు ఆధ్వర్యంలో నేతలు కలిశారు. విశాఖపట్నం వేదికగా త్వరలో జరగనున్న ఎపిడబ్ల్యుజెఎఫ్‌ రాష్ట్ర మహాసభలకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ఆహ్వానించారు. రాష్ట్ర మహాసభలకు తప్పకుండా హాజరవుతానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల ప్రధాన సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ఎపిడబ్ల్యుజేఎఫ్ నేతలు తీసుకువెళ్లారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఎపిడబ్ల్యుజెఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్. వెంకట్రావు, రాష్ట్ర నాయకులు కలిమి శ్రీ, ఆనంద్, మీరా తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్