విశాఖపట్నం : నిత్యావసర వస్తువుల పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ .... సిపిఎం జగదాంబ జోన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జగదాంబ జంక్షన్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జగదాంబ కూడలి నుంచి లాపాక్షి మీదుగా ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు వై. రాజు, ఎం. సుబ్బారావు, నర్సింగరావు, గణేష్, నూకరాజు, పోలేశ్వరరావు, సిమ్మప్పరావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ... కూటమి ప్రభుత్వం ప్రజలపై నిత్యావసర ధరల భారాన్ని మోపుతోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. ఉల్లిపాయల నుంచి పసిపిల్లలకు అందించే పాలు వరకు ధరలు పెంచడం దుర్మార్గమన్నారు. బడా కార్పొరేట్లకు ప్రభుత్వ భూములు, ఆస్తులను చవకగా కట్టబెట్టడం, బ్యాంకుల రుణాలను మాఫీ చేయడంలో చూపుతున్న శ్రద్ధ సామాన్య ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చూపడం లేదని నాయకులు విమర్శించారు. ప్రజలపై పెరుగుతున్న ధరల భారాన్ని తగ్గించి, నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెరిగిన ఉల్లిపాయ ధరలను ప్రతిబింబించేలా వినూత్న కళారూపాన్ని ప్రదర్శించడంతోపాటు వంటనూనె డబ్బాలు, గోధుమ ప్యాకెట్, బియ్యం బస్తా, ఆనపకాయ బండి, తదితర కళారూపాలను ప్రదర్శించారు. 2024–2026 మధ్య నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను చూపించే పట్టికను కూడా ప్రదర్శించారు. ఈ ప్రదర్శన ప్రజలను ఆకట్టుకుంది.
నిత్యావసర ధరలు తగ్గించాలి : సిపిఎం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 04, 2026, 01:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)