అమరావతి : ఎపి లో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన ప్రక్రియకు పురపాలక శాఖ షెడ్యూల్ విడుదల చేసింది. శుక్రవారం వార్డుల పునర్విభజన ప్రతిపాదనలు పంపాలని సంబంధిత కార్పొరేషన్లను ఆదేశించింది. సెప్టెంబర్ 5 నుంచి 11 వరకు ప్రతిపాదనలపై అధికారులు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. 12 న తుది ప్రతిపాదనలను పురపాలక శాఖ డైరెక్టరేట్‌కు పంపనుండగా, 13 న డిలిమిటేషన్ వార్డులను ప్రకటించి, 14 న ఎపి గెజిట్‌లో ప్రచురించనున్నారు. జివిఎంసి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, కడప, ఏలూరు, అనంతపురం, ఒంగోలు, చిత్తూరు, మచిలీపట్నం కార్పొరేషన్లకు ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.
ఎపి మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజనకు షెడ్యూల్ విడుదల
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 04, 2026, 02:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)