శుక్రవారం, 04 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పార్లమెంట్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా ఎంపీ సానా సతీష్ నియామకం

1 గంట క్రితం

పార్లమెంట్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా ఎంపీ సానా సతీష్ నియామకం
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 04, 2026, 03:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-కాకినాడ : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టీడీపీ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పార్లమెంట్‌లోని ప్రతిష్టాత్మకమైన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా రాజ్యసభ చైర్మన్ నామినేట్ చేసినట్లు ఎంపీ సానా సతీష్ బాబు కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. రాజ్యసభ కమిటీల పునర్వ్యవస్థీకరణలో భాగంగా స్టాండింగ్ కమిటీల సభ్యుల నియామయం చేపట్టారన్నారు.

రాజ్యసభలో సభా కార్యక్రమాల నిర్వహణ, చర్చకు వచ్చే అంశాల ప్రాధాన్యత, సభా సమయాన్ని కేటాయించడం వంటి కీలక పార్లమెంటరీ వ్యవహారాల్లో బిజినెస్ అడ్వైజరీ కమిటీ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు. ఇలాంటి కీలక కమిటీలో సభ్యుడిగా సానా సతీష్ బాబుకి అవకాశం లభించడం ఆంధ్రప్రదేశ్‌కు లభించిన ముఖ్యమైన ప్రాతినిధ్యంగా భావిస్తున్నారన్నారు.

రాజ్యసభలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలను సమర్థవంతంగా ప్రస్తావిస్తూ, ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలకు మరింత ప్రాధాన్యత తీసుకురావడానికి ఈ బాధ్యత దోహదపడుతుందని ఆయన అనుచరులు, టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బిజినెస్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నియమితులైన ఎంపీ సానా సతీష్ బాబుకి సహచర ఎంపీలు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్