బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఏలూరులో మహిళా అడ్వకేట్ పై దాడి

46 నిమిషాల క్రితం

దస్డ్
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026, 04:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- సోషల్ మీడియాలో వైరల్‌గా వీడియో

ఏలూరు: ఏలూరులో అడ్వకేట్, సామాజిక కార్యకర్త స్వర్ణలతపై దాడి జరిగిన ఘటన కలకలం రేపుతోంది. టీడీపీ నేతల అక్రమాలు, అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే తనపై ఓ మహిళ దాడికి పాల్పడ్డారని స్వర్ణలత ఆరోపిస్తున్నారు. ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట శిరీష అనే మహిళ స్వర్ణలతపై దాడి చేసినట్లు సమాచారం. స్కూటీపై వెళ్తున్న ఆమెను ఓ మహిళ అడ్డగించి, ఆమె ముఖంపై పిడిగుద్దులు గుద్దుతూ, జుట్టు పట్టుకుని రోడ్డుపై ఈడ్చినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టీడీపీ నేతల అక్రమాలను గతంలో ప్రశ్నించిన సమయంలోనూ తనపై దుర్భాషలాడి, దాడికి ప్రయత్నించారని స్వర్ణలత ఆరోపించారు. ముఖ్యంగా ఏలూరు షాడో ఎమ్మెల్యేగా పేర్కొంటున్న కంప్యూటర్ ప్రసాద్ అక్రమాలకు సంబంధించిన వివరాలను బయటపెట్టినందుకే తనపై దాడి చేయించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై దాడులు, వేధింపులకు పాల్పడిన వారిపై గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్వర్ణలత ఆగ్రహించారు. ఈ ఘటనపై పోలీసులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్