బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బ్రెజిల్‌తో వాణిజ్య, రాజకీయ సంబంధాల బలోపేతానికి కృషి : రష్యా

17 నిమిషాల క్రితం

russia.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026, 04:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మాస్కో : బ్రెజిల్‌తో వాణిజ్య, రాజకీయ, మానవతా సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నట్లు రష్యా బుధవారం తెలిపింది. వ్యూహాత్మక రంగాల్లో బ్రెజిల్‌తో ఉమ్మడి సహకారాన్ని విస్తరించేందుకు మాస్కో సిద్ధంగా ఉందని రష్యా విదేశాంగ శాఖ లాటిన్‌ అమెరికా విభాగం డైరెక్టర్‌ అలెగ్జాండర్‌ షెటినిన్‌ తెలిపారు. ఆర్థిక, వాణిజ్య, పెట్టుబడుల రంగాలతోపాటు మానవతా, సాంస్కృతిక, క్రీడా రంగాల్లోనూ పరస్పర సహకారానికి మంచి అవకాశాలున్నాయని పేర్కొన్నారు. బాహ్య ఆంక్షలకు తావులేని బహుళధ్రువ ప్రపంచ వ్యవస్థ నిర్మాణంపై ఇరు దేశాల రాజకీయ దృక్పథాలు ఒకే విధంగా ఉన్నాయని షెటినిన్‌ వెల్లడించారు. ఈ దిశగా ద్వైపాక్షిక రాజకీయ చర్చలను విస్తరించడంతోపాటు ఐక్యరాజ్యసమితి (యుఎన్‌), బ్రిక్స్‌, జి20 వేదికలపై పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవాలని ఇరు దేశాలు భావిస్తున్నట్లు తెలిపారు.

బ్రెజిల్‌, అమెరికా మధ్య సంబంధాలు క్షీణిస్తున్న సమయంలో ఈ దౌత్యపరమైన ముందడుగు పడింది. అక్టోబరులో జరగనున్న ఎన్నికలకు ఎనిమిది వారాల ముందు బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డ సిల్వా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలతోపాటు బ్రిక్స్‌ కూటమి పాత్రను మరింత బలోపేతం చేయడంపై చర్చించారు. బ్రెజిల్‌ బ్రిక్స్‌ కూటమి వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది. వాణిజ్య సంబంధాల్లో మరింత సమతుల్యత సాధించడం, రష్యాకు బ్రెజిల్‌ ఎగుమతులను పెంచడం వంటి అంశాలపై పుతిన్‌తో చర్చించినట్లు లూలా వెల్లడించారు. బ్రెజిల్‌ దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ 25 శాతం సుంకాలు విదించడంతో, ప్రతిస్పందనగా ఈచర్చలు జరిగాయి. అమెరికా సుంకాలను బ్రెజిల్‌ ప్రభుత్వం ‘ దురదృష్టకరమైన పరిణామం’ గా పేర్కొంది. పుతిన్‌తో సంభాషణ సందర్భంగా బ్రెజిల్‌-రష్యా సంబంధాల వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని లూలా ప్రస్తావించారు. ఇంధనం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, నౌకాదళ రంగాల్లో సహకారాన్ని విస్తరించుకోవాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంచుకోవడంతోపాటు డీజిల్‌, ఎరువుల సరఫరాపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్