గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionబిల్కిస్ బానో వాదన వినాలి : ఐద్వా

-1358 నిమిషాల క్రితం

aidwa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 11:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

‌ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : బిల్కిస్ బానో కేసులో ఇద్దరు దోషుల జీవిత ఖైదును సస్పెండ్ చేస్తూ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం దిగ్భ్రాంతికరమని, ఆమోదయోగ్యం కాదని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి వి.సావిత్రి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాధితురాలి వాదన వినకుండా ఉత్తర్వులు జారీ చేయడం న్యాయానికి గొడ్డలిపెట్టువంటిదని తెలిపారు. గుజరాత్‌లో 2002 మత హింసాకాండ సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడటంతోపాటు, ఆమె కుటుంబ సభ్యులను హత్య చేసిన కేసులో దోషులుగా తేలిన బిపిన్ చంద్ర కనయాలాల్ జోషి, ప్రదీప్ రామన్‌‌లాల్ మోధియాలకు దీర్ఘకాలం జైలులో ఉన్నారనే కారణంతో బెయిల్ మంజూరు చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ఇద్దరు దోషులు పెరోల్, ఫర్లా కింద 17 నెలలకు పైగా జైలు వెలుపల గడిపారని గుర్తుచేశారు.

బెయిల్ మంజూరుకు సుప్రీంకోర్టు పేర్కొన్న కారణాలు అస్పష్టంగా ఉన్నాయని, గతంలో ఇదే కేసుల్లో దోషుల శిక్ష మినహాయింపును సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. తాజా నిర్ణయం న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బిల్కిన్ బానోకు న్యాయం చేయడం, ఒక మహిళకు సంబంధించిన అంశం కాదని, దేశంలోని మహిళలందరి గౌరవం, భద్రత, న్యాయ హక్కులకు సంబంధించిన విషయమని స్పష్టం చేశారు. బాధితురాలి వాదన వినకుండా దోషులకు ఉపశమనం కల్పించడం సరికాదని పేర్కొన్నారు. బిల్కిస్ బానో వాదనను వినాలని, తాజా ఉత్తర్వులను ఉపసంహరించుకుని ఆమెకు న్యాయం చేయాలని ఐద్వా డిమాండ్‌ చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్