గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనీటి పొదుపు..

-199 నిమిషాల క్రితం

నీటి పొదుపు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 04:28 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

రాము ఏడవ తరగతి చదువుతున్నాడు. చదువులో ఎప్పుడూ ముందుంటాడు. ఒక రోజు మొదటి తరగతికి తెలుగు ఉపాధ్యాయుడు సెలవుపెట్టడంతో రామును ఆ క్లాసు లీడర్‌గా ఉండమని ప్రధానోపాధ్యాయుడు చెప్పారు. రాము ఆ చిన్న పిల్లలకు నీటి పొదుపు గురించి చెప్పాలనుకున్నాడు. ‘డబ్బును పొదుపు చేసినట్లే నీటిని కూడా మనం పొదుపుగా వాడుకోవాలి’ అన్నాడు రాము. ‘ఎలా?’ అని పిల్లలు అయోమయంగా ముఖం పెట్టారు. అది చూసి రాము ఇలా చెప్పాడు. ‘మన పాఠశాలలో మొత్తం నాలుగు కొళాయిలు ఉన్నాయి. వాటిలో రెండిటి నుండి చుక్కలు చుక్కలుగా నీళ్లు కారి వృధాగా పోతున్నాయి. వాటిని వెంటనే బాగు చేయించాలి’ అని చెప్పాడు. ‘ఇంకా ఇలాంటివి ఏవైనా మీరు గుర్తిస్తే చెప్పండి’ అని అన్నాడు. ‘ఉదయం పూట బ్రష్ చేసుకున్నప్పుడు కొళాయిని ధారగా తిప్పి కడుగుతుంటాం. అలా కాకుండా మగ్గుతో నీళ్లు పట్టుకుని బ్రష్ చేయడం వల్ల నీరు పొదుపు చేయవచ్చు’ అన్నాడు కిషోర్. ‘గ్రామ ప్రాంతాలలో వీధి కొళాయీలలో నీరు పట్టుకునే వారికి కూడా నీరు వృధా చేయకుండా అవగాహన కలిగించాలి’ అన్నాడు రమేష్. నీటి పొదుపు పట్ల చిన్న పిల్లల్లో ఉన్న అవగాహనకు రాము చాలా ఆశ్చర్యపోయాడు. ఆ చర్చను ఇంకాస్త లోతుగా తీసుకెళ్లాలనుకున్నాడు. ‘చాలా ప్రాంతాల్లో దాహం తీర్చుకోవడానికి మహిళలు, పురుషులు ఎంతో దూరం వెళ్లి చిన్న చిన్న చెరువులు, ఊట బావుల నుండి బిందెలతో నీళ్లు తెచ్చుకుంటారు. అదీ కాక ఈసారి ఎల్ నినో ప్రభావం వల్ల చాలా చోట్ల తక్కువ వర్షపాతం నమోదయ్యింది. ప్రతి ఒక్కరూ బాధ్యత వహించి నీటిని వృధా చేయకుండా చూసుకోవాలి’ అని చర్చను ముగించాడు రాము. తరువాత పీరియడ్ కోసం గంట మోగింది.

- యు. విజయశేఖర రెడ్డి, హైదరాబాద్.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్