నాలుగు చోట్ల వైస్ ఎంపిపి స్థానాలు
ప్రజాశక్తి - యంత్రాంగం : గురువారం జరిగిన ఎంపిపి, వైస్ ఎంపిపి ఎన్నికల్లో ఎటపాక ఎంపిపి స్థానాన్ని, మరొక నాలుగు చోట్ల వైస్ ఎంపిపి స్థానాలను సిపిఎం దక్కించుకుంది. పోలవరం, ఏలూరు, కర్నూలు జిల్లాల నుంచి ఎంపికైన వారిలో ఉన్నారు.
పోలవరం జిల్లా ఎటపాక ఎంపిపి పీఠం సిపిఎంకు దక్కింది. విస్సాపురం ఎంపిటిసి సభ్యునిగా సిపిఎం నుంచి పోటీ చేసి గెలుపొందిన సోందే రామారావు ఎంపిపిగా ఎన్నికయ్యారు. ఆయన 2013 నుంచి 2018 వరకు నల్లకుంట సర్పంచ్‌గా సేవలందించారు. డివైఎఫ్ఐ, పిఎన్ఎమ్, ఆదివాసీ గిరిజన సంఘంలో పలు బాధ్యతలు నిర్వర్తించారు.
విఆర్.పురం వైస్ ఎంపిపిగా సిపిఎం రామవరం ఎంపిటిసి సభ్యులు కారం సుందరయ్య ఎన్నికయ్యారు.
కూనవరం వైస్ ఎంపిపిగా పెద్దార్కూర్ సిపిఎం ఎంపిటిసి సభ్యులు పాయం సీతారామయ్య ఎన్నికయ్యారు.
కోడుమూరు 5వ ఎంపిటిసిగా గెలుపొందిన సిపిఎం నాయకులు కనికె నాగిరెడ్డి కోడుమూరు వైఎస్ ఎంపిపిగా ఎన్నికయ్యారు. ఆయన రెండు దఫాలుగా ఎంపిటిసి సభ్యునిగా గెలిచారు.
ఏలూరు జిల్లా వేలేరుపాడు వైస్ ఎంపిపిగా సిపిఎం నాళ్లవరం ఎంపిటిసి సభ్యులుగా ఊకే సరోజిని ఎన్నికయ్యారు.
వైస్ ఎంపిపి ప్రమాణ స్వీకారంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.నాగమణి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డిఎన్‌విడి ప్రసాద్, నాయకులు మడివి దుర్గారావు, మండల కార్యదర్శి ధర్ముల రమేష్, కుక్కునూరు మండల కార్యదర్శి సాయికిరణ్ పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)