మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్థానిక సంస్థల ఎన్నికలకు కేంద్ర బలగాలను రప్పించండి

1 రోజు క్రితం

ysrcp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 06, 2026, 11:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైసిపి లేఖ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : స్థానిక ఎన్నికల్లో భద్రత కోసం కేంద్ర బలగాల్ని మోహరించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని వైసిపి కోరింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి.. ఎన్నికల సంఘానికి ఆదివారం లేఖ రాశారు. అధికార యంత్రాంగ దుర్వినియోగం, అధికార పార్టీ వ్యక్తుల జోక్యం, బెదిరింపుల నేపథ్యంలో స్వేచ్ఛగా, నిష్పక్షిపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర బలగాల భద్రత అవసరమని తెలిపారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలో జరిగిన జడ్‌‌పిటిసి ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన వ్యక్తులు పోలింగ్ ప్రక్రియలో జోక్యం చేసుకున్నారని, 2025 ఆగస్టు 7న నాగులదిన్నెవారిపల్లె గ్రామంలో వైసిపి ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్, పార్టీ నేత వెలుపుల రామలింగారెడ్డిని లక్ష్యంగా చేసుకుని దాడి చేశారని, మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇలాంటి దారుణాలకే తెగబడ్డారని, తుని, పిడుగురాళ్ల, పాలకొండ మున్సిపాలిటీల్లో ఎన్నికల సమయంలో ఇలాంటి అరాచకాలే చేశారని లేఖలో పేర్కొన్నారు. పోలింగ్ రోజున మాత్రమే కాకుండా నామినేషన్ల నుంచి, ఎన్నికల సామగ్రి రవాణా, స్ట్రాంగ్‌రూమ్‌ల భద్రత వరకు అన్ని కీలక దశల్లో కూడా కేంద్ర బలగాలను అందుబాటులో ఉంచాలని, సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ తగిన భద్రతా చర్యలు చేపట్టాలన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్