గుంటూరు : గుంటూరు నగరంలో పట్టపగలు దారుణహత్య జరిగింది. స్థానిక కొండా వెంకటప్పయ్య కాలనీలో చిన్నా అనే వ్యక్తిని ప్రత్యర్థులు కత్తులతో నరికి చంపారు. 20 ఏళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసులో చిన్నా నిందితుడిగా ఉన్నాడు. ఘర్షణల నేపథ్యంలో అతను తెలంగాణలోని సూర్యాపేట వెళ్లి అక్కడే కుటుంబంతో జీవిస్తున్నాడు. గుంటూరులో ఉండే అతని బాబాయ్ చనిపోవడంతో అంత్య క్రియల్లో పాల్గొనేందుకు ఆదివారం సూర్యాపేట నుంచి గుంటూరు వచ్చాడు. దీంతో ప్రత్యర్థులు కాపు కాచి చిన్నాపై దాడి చేసి దారుణంగా హత్య చేశారు. నగరం పాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గుంటూరులో పట్టపగలు దారుణ హత్య
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 30, 2026, 01:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)