రాళ్లను చెక్కి
శిల్పాలను తయారు చేసే శిల్పి ఉంటాడు...
కానీ
మనుషులను చెక్కి
మంచి మనసులుగా తీర్చిదిద్దే
శిల్పి ఒక్కరే...
అతడే గురువు!
కులం కాదు
మతం కాదు
మనిషితనమే గొప్పదని చెబుతాడు...
ద్వేషం కాదు
సహనం కావాలని నేర్పుతాడు...
హక్కులతో పాటు
బాధ్యతలను గుర్తు చేస్తాడు...
స్వేచ్ఛతో పాటు
సంయమనం అవసరమని చెబుతాడు...
పుస్తక జ్ఞానంతో పాటు
మానవీయ విలువలను అందిస్తాడు...
అలా ఒక తరాన్ని మార్చి
మరో తరాన్ని తీర్చిదిద్ది
మంచి సమాజానికి
బలమైన పునాది వేస్తాడు...
అందుకే
గురువు కేవలం ఉపాధ్యాయుడు కాదు
సమాజ శిల్పి !

మలిశెట్టి సాయి ప్రణవి
6వ తరగతి,
కుమార్ సిబిఎస్‌ఇ స్కూలు,
నూజివీడు,
ఏలూరు జిల్లా.







కామెంట్‌లు (0)