ఆదివారం, 30 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

గురువు... ఒక వెలుగు

1 గంట క్రితం

A Guru... a guiding light.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 30, 2026, 01:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

చీకటిలో దారి చూపే దీపం కాదు గురువు

చీకటిని చూసి భయపడకుండా

దారిని మనమే వెతుక్కునేలా చేసే వెలుగు

అక్షరాలను నేర్పి ఆపేయడు

ఆ అక్షరాల వెనుక ఉన్న

ఆలోచనను పరిచయం చేస్తాడు

పుస్తకంలోని పాఠంతో పాటు

జీవితం అనే పెద్ద పాఠశాలలో

ఎలా నడవాలో నేర్పుతాడు

ఓటమి ఎదురైతే

కుంగిపోకూడదని

విజయం వస్తే

విర్రవీగకూడదని చెబుతాడు

ఒక విద్యార్థిని తీర్చిదిద్దడం కాదు

ఒక కుటుంబ భవిష్యత్తును మార్చడం

వందలాది విద్యార్థుల చేతుల్లో

భవిష్యత్తును పెట్టి

నిశ్శబ్దంగా వెనక్కి నిలబడే

మహోన్నత శిల్పి... గురువు !


image

వడ్డెల్లి రుత్విక్‌ సాయి వినయ్‌,

7వ తరగతి

వేమన ఇంటర్నేషనల్‌ స్కూలు, చిన్న దోర్నాల,

మార్కాపురం జిల్లా.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్