ఆదివారం, 30 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

పావురం స్నేహం

1 గంట క్రితం

The Pigeon's Friendship
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 30, 2026, 01:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఒక అడవిలో రామయ్య అనే వ్యక్తి ఎండిన కట్టెలు కొట్టి, వాటిని అమ్ముకొని జీవనం సాగించేవాడు. ఒక రోజు పెద్ద గాలి వాన వచ్చింది. ఓ చెట్టుపై నుంచి గూడు కింద పడింది. అందులో చిన్న చిన్న పావురం పిల్లలున్నాయి. పావురం తన పిల్లలు కింద పడ్డాయని బాధతో అరుస్తుంది. రామయ్యకు వాటిని చూడగానే జాలి వేసింది. ఆ గూడును తీసి జాగ్రత్తగా మళ్ళీ చెట్టు మీద పెట్టాడు. తల్లి పావురం చాలా సంతోషించింది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. వేసవి కాలం వచ్చింది. రామయ్య కొన్ని ఎండు కట్టెలు కొట్టిన తర్వాత అలసిపోయి వేప చెట్టు కింద నిద్రపోయాడు. ఇంతలో ఓ పాము అటుగా వచ్చింది. పావురం రామయ్యను నిద్రలేపడానికి వేప చెట్టు పండ్లను తెంపి రామయ్య తలపై వేసింది. వేప పండ్ల స్పర్శ తగలడంతో రామయ్య నిద్ర నుంచి గబుక్కున లేచి, పామును చూశాడు. తన దగ్గర ఉన్న కర్రను తీసుకొని, పామును చంపాడు.


​నీతి :- ఎవరికైనా మనం ఆపదలో ఆదుకుంటే, ఆ సహాయం ఎప్పుడైనా కష్టాల నుంచి మన్నల్ని కాపాడుతుంది.


umesh

పి. ఉమేష్

7వ తరగతి,

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల

మేడిపల్లి, సిద్ధిపేట జిల్లా.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్