ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కడపలో 70 మంది వైసిపి నేతలపై కేసులు

1 గంట క్రితం

case file
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026, 12:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కడప : మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలపై కడప పోలీసులు కేసులు నమోదు చేశారు. కడప గాంధీనగర్‌ పాఠశాల వద్ద జరిగిన రాళ్ల దాడి ఘటన, ఎర్ర ముక్కపల్లెలో వాహనాల ధ్వంసం, కారు దగ్ధం కేసుల్లో మొత్తం 70 మందికిపైగా వైసిపి నేతలపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. కేసులు నమోదైన వారిలో మాజీ డిప్యూటీ మేయర్‌ నిత్యానందరెడ్డి కూడా ఉన్నారు. రాయచోటి వైసిపి మున్సిపల్‌ ఛైర్మన్‌ అభ్యర్థి షరీఫ్‌ జిన్నాతో పాటు 15 మందిపై కేసులు నమోదయ్యాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి మిథున్‌రెడ్డికి పుంగనూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సెక్షన్‌ 168 బీఎన్‌ఎస్‌ కింద పోలీసులు నోటీసులు అందజేశారు. మూడో రోజు నామినేషన్ల ప్రక్రియ నేపథ్యంలో పుంగనూరులో పర్యటించవద్దని నోటీసుల్లో పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్