గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

అల్లూరి, పింగళి,రోశయ్యకు చంద్రబాబు నివాళులు

4 రోజుల క్రితం

condolence
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 09:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు, జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సామాజిక మాధ్యమం ద్వారా శనివారం నివాళులర్పించారు. గిరిజన హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం బ్రిటిష్ పాలనకు ఎదురొడ్డి అపూర్వ సాహసాన్ని అల్లూరి ప్రదర్శించిన మహానీయుడు అని తెలిపారు. అల్లూరి త్యాగం, ధైర్యం, దేశ భక్తి భారతజాతికి చిరస్మరణీయమని తెలిపారు. అల్లూరి 129వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. భారత జాతి ఐక్యత, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య తెలుగువారు కావడం గర్వకారణమని పేర్కొన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంతో పాటు విద్య, వ్యవసాయం, శాస్త్రీయ రంగాల్లోనూ విశిష్ట సేవలు అందించిన మహానీయడు అని, ఆయన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా నివాళలు అర్పించారు. విలువలతో కూడిన రాజకీయాలు, ఆర్థిక క్రమశిక్షణకు ప్రతికగా రోశయ్య ప్రజా జీవితంలో చెరగని ముద్ర వేశారని చంద్రబాబు తెలిపారు. ఉపముఖ్యమంత్రి పవన్‌ ‌కళ్యాణ్‌ ‌మరో ప్రకటనలో అల్లూరి నివాళలు అర్పించారు. స్వేచ్ఛ కోసం బ్రిటిష్ పాలనను ధైర్యంగా అల్లూరి ఎదురించి, గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం కోసం తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. అల్లూరి దేశ భక్తి, త్యాగనిరతికి నెలువెత్తు నిదర్శంగా నిలిచారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరో ప్రకటనలో తెలిపారు. తెలుగువారి మదిలో మెరిసిన త్రివర్ణ పతాకం భారతజాతి గుండెల్లో చిరస్థాయికి నిలిపిన వ్యక్తి పింగళి అని లోకేష్‌ పేర్కొన్నారు. నిస్వార్థ, నిష్కళంక నేత, అజాతశత్రువుగా రోశయ్య పేరుగాంచారని ‌మరో ప్రకటనలో తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్