సాక్షులను ప్రభావితం చేయవద్దని హై కోర్టు ఆదేశం
ప్రజాశక్తి -హైదరాబాద్ బ్యూరో : పోక్సో కేసు నిందితుడు బండి సాయి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. రెండు ష్యూరిటీలు, రూ.లక్ష పూచీకత్తు చెల్లించాలని ఆదేశించింది. సాక్ష్యులను ప్రభావితం చేయొద్దని ఆదేశించింది. ఇప్పటికే సాయి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిసిన నేపథ్యంలో హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. నిందితుడికి బెయిల్ మంజూరు చేయొద్దని బాధితురాలి తరపు లాయర్ వాదనలు వినిపించారు. నిందితుడు తండ్రి కేంద్రమంత్రి కాబట్టి కేసుపై ప్రభావం చూపిస్తుందన్నారు. ఈ కేసులో సాక్షులను విచారణ చేయాల్సి ఉందని కోర్టుకు వినవించారు. నిందితుడు బయటకు వస్తే సాక్షులు స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు నిరాకరించే అవకాశం ఉందని వాదనలు వినిపించారు. భగీరథ్ జైల్లో ఉన్నప్పుడే కేసు విచారణ పారదర్శకంగా జరుగుతుందని కోర్టుకు నివేదించారు. బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని పేట్ బషీరాబాద్ పోలీసులు కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు.
పోలీసులు బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశామని తెలిపారు. బాలిక వాంగ్మూలాన్ని నమోదు చేసిన తర్వాత ఆరోపణలు తీవ్రంగా ఉండటంతో అభియోగాలను సవరించామని కోర్టుకు తెలిపారు. తొమ్మిది రోజుల హైడ్రామాకు తెరదించుతూ మే 16న పోక్సో కేసులో నిందితుడిని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం చర్లపల్లి జైలుకు తరలించగా పోలీస్ కస్టడీకి అనుమతి లభించింది. కేసులో వాదనల అనంతరం నిందితుడికి హై కోర్టు బెయిల్ మంజూరు చేసింది.








కామెంట్‌లు (0)