మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరెడ్‌‌బుక్‌ ఎన్నికల్లో రిగ్గింగ్‌ మ్యాన్‌ చంద్రబాబు

42 నిమిషాల క్రితం

రెడ్‌‌బుక్‌ ఎన్నికల్లో రిగ్గింగ్‌ మ్యాన్‌ చంద్రబాబు
- మాజీ మంత్రి విడదల రజని విమర్శలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026, 09:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మాజీ మంత్రి విడదల రజని విమర్శలు

ప్రజాశక్తి-చిలకలూరిపేట (పల్నాడు జిల్లా) : స్థానిక ఎన్నికల్లో సిఎం చంద్రబాబు రెడ్‌బుక్ ఎలక్షన్స్ రిగ్గింగ్ మ్యా‌న్‌‌గా అవతరించారని, కూటమి పార్టీలతోపాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్, అధికారులు, పోలీసులు కలిసి మరో కూటమిగా ఏర్పడి ఎలక్షన్లను సెలక్షన్లుగా మార్చారని మాజీ మంత్రి విడదల రజని విమర్శించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని తన నివాసంలో మంగళవారం విలేకర్లతో ఆమె మాట్లాడారు. టిడిపి నాయకులు, గూండాలు, రౌడీలు, అధికారులు, పోలీసులు అంతా కలిసి వైసిపిపై యుద్ధం చేస్తున్నారని, ముఖ్యంగా పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో వైసిపి ఇన్‌‌ఛార్జులు, అభ్యర్థులే లక్ష్యంగా అక్రమ కేసులతోపాటు బెదిరింపులు, దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో అర్ధరాత్రి వరకూ నామినేషన్ ఉపసంహరణ కేంద్రాలను తెరిచి ఉంచడం, అభ్యర్థులను బలవంతంగా తీసుకెళ్లి ఉపసంహరణలు చేయించడం, అభ్యర్థులతో సంబంధం లేని ఉపసంహరణ పత్రాలను ఆమోదించడం వంటి ఘటనలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హైకోర్టు రక్షణ కల్పించినా దౌర్జన్యాలు ఆగడం లేదని, సౌత్‌ బీహార్‌‌గా రాష్ట్ర్రాన్ని మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులు, నిర్బంధాలకు పాల్పడుతున్నారని, ఎఫ్‌ఐఆర్‌‌లు చూపాలని అడుగుతున్నా సమాధానమివ్వడం లేదన్నారు. తిమ్మాపురంలో లోకేష్‌ పిఎ, బాలకృష్ణ పిఎ వివాదంలో హత్యాయత్నం కేసులు పెట్టి కూడా బెయిల్‌ ఇచ్చారని, వైసిపికి చెందిన 40 మందిని మాత్రం గ్రామాలకు దూరంగా ఉంచారని విమర్శించారు. ఓటమికి భయపడే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించడం లేదని విమర్శించారు. వీటన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని, సమాధానం చెప్పే రోజు వస్తుందని హెచ్చరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్