మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionభూ కేటాయింపులపై శ్వేతపత్రం

36 నిమిషాల క్రితం

- కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026, 10:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో భూ కేటాయింపుల పేరుతో భారీ అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆరోపించారు. విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వేలాది ఎకరాల భూములను ప్రభుత్వానికి అనుకూలమైన ధనవంతులకు కట్టబెట్టారని విమర్శించారు. ఈ భూములను పొందిన సంస్థలు ఎన్ని ఎకరాలు తీసుకున్నాయి? ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు పెట్టాయి? ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాయి? అనే వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. భూములు పొందిన అనేక మంది పారిశ్రామికవేత్తలు ఇప్పటి వరకు ఫ్యాక్టరీలను ప్రారంభించలేదన్నారు. జనవరి ఒకటో తేదీలోపు రాష్ట్రంలో జరిగిన భూ కేటాయింపులన్నింటిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే జాతీయ బ్యాంకుల్లో రూ.16.50 లక్షల కోట్ల రుణమాఫీకి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తూ కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.

​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్