టోల్ ఫ్రీ నంబరు 1972 పోస్టర్ ఆవిష్కరణ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: డ్రగ్స్, నార్కోటిక్స్‌కు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఎలైట్ యాంటీ నార్కొటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈగల్) ఆంధ్రప్రదేశ్ విభాగం టోల్ ఫ్రీ ఫోన్ నంబరు 1972కు సంబంధించిన ప్రచార పోస్టర్ (ఈగల్ 1972)ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం ఆవిష్కరించారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ‘ఈగల్’ నిర్వహిస్తున్న కార్యక్రమాలను, సేవలను సిఎం ప్రశంసించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధాన వేదికపైన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ‘ఈగల్’ ఐజిపి ఆకే రవికృష్ణ, ఎస్‌పి జి స్వరూపారాణి, ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. యోగాంధ్ర సందర్భంగా ‘డ్రగ్స్ వద్దు బ్రో..యోగా ముద్దు బ్రో’ అంటూ ఐజిపి ఆకే రవికృష్ణ పిలుపుతో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ‘ఈగల్’ అవగాహన కార్యక్రమాలు చేపట్టింది.








కామెంట్‌లు (0)