ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: వైసిపి ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మహిళా ఎస్ఐపై అనుచిత ప్రవర్తన, విధులకు ఆటంకం కలిగించారన్న కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న ఆయనను పోలీసులు ఈ నెల 8వ తేదీన ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలో శనివారం అరెస్టు చేసి పాతపట్నం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పాతపట్నం ప్రభుత్వాస్పత్రిలో ఆదివారం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం శ్రీకాకుళం నగరంలోని ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఇంటి వద్ద హాజరుపరిచారు. రవికుమార్‌తో పాటు ఇప్పిలి శశికుమార్, కుసుమంచి హరీష్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. రవికుమార్‌ను కోర్టుకు తీసుకొస్తున్నారన్న సమాచారంతో వైసిపి శ్రేణులు భారీగా కోర్టుకు తరలివచ్చాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇదే కేసులో ఈ నెల 8వ తేదీన తొమ్మిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్ విధించడంతో అంపోలులోని జిల్లా జైలుకు పోలీసులు తరలించారు.
చింతాడ రవికుమార్‌కు రిమాండ్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 09, 2026, 09:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)