మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిఐఐ సమ్మిట్‌ విజయవంతం

14 నవంబర్, 2026

tdp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 08:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- టిడిపి ఎంపి అప్పలనాయుడు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ​విశాఖపట్నం వేదికగా రెండు రోజుల పాటు జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సు అద్భుతమైన విజయం సాధించిందని, ఇది రాష్ట్ర అభివృద్ధిలో ఒక గొప్ప శుభపరిణామమని టిడిపి ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. టిడిపి కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఐదేళ్ల పాలనలో అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అనుభవంతో, దూరదృష్టితో చేస్తున్న ప్రయత్నాలు నేడు ఫలించాయని తెలిపారు. దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు తరలివచ్చి, రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చారని అన్నారు. లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి రావడం ఎంతో సంతోషకరమని తెలిపారు. కంపెనీల రాక, వ్యాపార ఒప్పందాలకే పరిమితమవుతున్న సదస్సు ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా సిఎం 'పి4' విధానాన్ని ప్రోత్సహించడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. పి4 కార్యక్రమం ప్రవేశపెట్టిన తర్వాత పేదల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెరిగాయని, ఈ సదస్సుతో కూటమి ప్రభుత్వంపై వారికి మరింత నమ్మకం ఏర్పడిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల్లోని 1,220 మంది ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఆర్థిక సాయం అందించేందుకు హీరో మోటార్స్ కార్పొరేషన్ సంస్థ స్వర్ణాంధ్ర ఫౌండేషన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం గొప్ప అవకాశమన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్