శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వ్యాపార, సాంకేతిక భాగస్వామ్యాల దిశగా సిఐఐ సమ్మిట్‌...

40 నిమిషాల క్రితం

cm chadrababu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026, 10:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ప్రపంచ మార్కెట్లతో రాష్ట్ర పరిశ్రమల అనుసంధానమే లక్ష్యం

- సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: విధాన రూపకర్తలు, పెట్టుబడిదారులు, పరిశ్రమలు, విద్యా సంస్థలు, అంకుర సంస్థలను అనుసంధానిస్తూ చర్చలను వ్యాపార, సాంకేతిక భాగస్వామ్యాల దిశగా సిఐఐ సమ్మిట్ నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రపంచ మార్కెట్లతో రాష్ట్ర పరిశ్రమలను అనుసంధానించడం, ఎంఎస్‌ఎంఇలకు కొత్త వ్యాపార పరిచయాలు కల్పించడం ప్రధాన లక్ష్యం కావాలన్నారు. ఈ నెల 12, 13 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న సిఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్–2026 నిర్వహణ ఏర్పాట్లు, చర్చించాల్సిన అంశాలు, ప్రతిపాదిత డిక్లరేషన్లపై అధికారులు, సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీతో ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ.. సాంకేతిక సహకారాన్ని విస్తరించడం, యువత నైపుణ్యాలకు అంతర్జాతీయ అవకాశాలను పరిచయం చేయడం వంటి అంశాల్లో రాష్ట్రం ప్రాధాన్యం పెంచేలా సదస్సు ఉండాలన్నారు. ఎస్క్రో అకౌంట్ ద్వారా పారిశ్రామిక రాయితీల చెల్లింపు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి విధానాలు ప్రపంచ వ్యాప్తం కావాలన్నారు. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, సెమీకండక్టర్ వంటి రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. అత్యుత్తమ పాలసీలు, సమర్థులైన నిపుణులు, మౌలిక సదుపాయాలు, నాలెడ్జ్, బలమైన నాయకత్వం వంటి అనుకూలతలు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. ‘నావిగేటింగ్ న్యూ వరల్డ్ ఆర్డర్: ట్రేడ్, టెక్నాలజీ, ట్రస్ట్’ థీమ్‌తో రెండు రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ సదస్సుకు సుమారు 59 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 15 మంది విదేశీ మంత్రులు, 40 మందికి పైగా అంతర్జాతీయ వక్తలు, 350 మంది విదేశీ ప్రతినిధులు, 900 మంది భారతీయ ప్రతినిధులు కలిపి సుమారు 1,250 మంది ఈ సదస్సులో భాగస్వాములు కానున్నారని తెలిపాయి. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శి కార్తికేయ మిశ్రా పాల్గొన్నారు. వర్చువల్‌‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ ‌రావత్‌, ముఖ్యకార్యదర్శి ముఖేష్‌ ‌కుమార్‌ ‌మీనా, కార్యదర్శి కాటమినేని భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్