ముంబయి : భారత ఈక్విటీ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐలు) మళ్లీ భారీగా కొనుగోళ్లు ప్రారంభించారు. గత వారం రోజుల్లోనే రూ.45,960 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొనుగోలు చేశారు. అక్టోబర్‌లో రూ.45,162 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్న విదేశీ మదుపర్లు అక్టోబర్ 6తో ముగిసిన ఒక్క వారంలోనే అంతకంటే ఎక్కువ మొత్తాన్ని తిరిగి భారత మార్కెట్లలో పెట్టడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లలో ఎఐ సంబంధిత షేర్ల పతనం, ముడిచమురు ధరల తగ్గుదల, భారతీయ పెద్ద కంపెనీల షేర్ల ధరలు ఆకర్షణీయంగా మారడం ఈ కొనుగోళ్లకు కారణాలుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
వారంలో రూ.45,960 కోట్ల ఎఫ్‌ఐఐ రాక...
11 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 07, 2026, 11:02 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)