బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘అక్వాన్‌’ తుపాను గమనం పై సిఎం టెలికాన్ఫరెన్స్‌

17 నవంబర్, 2026

CM holds teleconference on the path of Cyclone Akwan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 11:33 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : ‘అక్వాన్‌’ తుపాను పై సిఎం చంద్రబాబు మంగళవారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తుపాను గమనం పై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుపాను గంటకు 3.కి.మీ వేగంతో కదులుతోందని. ఈ సాయంత్రానికి తీవ్రతపై మరింత స్పష్టత వస్తుందని ఆర్టీజీఎస్‌ అధికారులు తెలిపారు. విపత్తులు వచ్చాయని భయపడాల్సిన పనిలేదని, వాటి ప్రభావం ప్రజలపై పడకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. తుపాను ప్రభావిత ప్రాంతాలకు వాతావరణ హెచ్చరికలు పంపాలని సూచించారు. తమను ఆదుకోవడానికి ప్రభుత్వం, అధికారులు ఉన్నారనే భరోసా కల్పించాలన్నారు. ఇటీవల కాలంలో రాష్ట్రాన్ని మూడో తుపాను తాకుతోందన్నారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సిబ్బంది ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు ఈ సమాచారం పంపాలన్నారు. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు కూలినా వెంటనే క్లియర్‌ చేయాలని చెప్పారు. ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. తుపానుతో కురిసే భారీ వర్షాలకు చెరువులు, కాలువలకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సిఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్