ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఈదల రామారావు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో మడికి తెలుగుదేశం పార్టీ నాయకులు పంపన అంజిబాబు, ఈదర రమేష్, మల్యాల రాజేష్‌లు రామారావును మర్యాదపూర్వకంగా కలిసి, అభినందించి, బుధవారం ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి, మొక్కను బహూకరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషకరమన్నారు. రామారావు తన పదవికి వన్నె తెచ్చేలా ప్రజలకు, మండల అభివృద్ధికి సేవలందించాలని ఆకాంక్షించారు. ఆయన నాయకత్వంలో మండలంలోని గ్రామాల అభివృద్ధికి మరింత ప్రాధాన్యత లభించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రామారావు మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు అధికారుల సమన్వయంతో మండల అభివృద్ధికి తన వంతు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.
వైస్ ఎంపీపీ రామారావుకు నేతల అభినందన
19 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 25, 2026, 03:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)