బుధవారం, 25 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బంగారు గనిలో 29 మంది కార్మికులు గల్లంతు

24 నిమిషాల క్రితం

indonesia
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 25, 2026, 03:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఇండోనేషియాలో ఘోర ప్రమాదం

జకార్తా: బంగారం కోసం అక్రమ గనిలోకి వెళ్లిన 29 మంది కార్మికులు గల్లంతయ్యారు. ఇండోనేషియాలోని పశ్చిమ జావా ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం కురిసిన భారీ వర్షాల కారణంగా సమీపంలోని సిసెరు నది పొంగిపొర్లింది. దీంతో వరద నీరు గనిలోకి చేరి, బయటకు వెళ్లే మార్గాన్ని మూసివేసింది. ఈ క్రమంలో గనిలో ఉన్న కార్మికులు చిక్కుకుపోయారు. ఈ గని ఇండోనేషియా రాజధాని జకార్తాకు దక్షిణంగా ఉన్న పర్వత ప్రాంతంలో ఉంది. సుమారు 100 అడుగుల లోతులో ఈ గని ఉన్నట్లు సమాచారం. ఇండోనేషియాలో ఇలాంటి అక్రమ గనులు అనేకం ఉన్నాయి. ఉపాధి కోసం వేలాది మంది కార్మికులు ఎలాంటి భద్రతా సదుపాయాలు లేని పాత గనుల్లో బంగారం వెలికితీస్తుంటారు. ఇలాంటి గనుల్లో పనిచేసే కార్మికులకు అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయి. భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడటం, వరదలు రావడం, సొరంగాలు కూలిపోవడం వంటి ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. అంతేకాకుండా బంగారం వెలికితీసేందుకు పాదరసం, సైనైడ్ వంటి ప్రమాదకర రసాయనాలను ఉపయోగించడం వల్ల కూడా కార్మికుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది.

ప్రస్తుతం గనిలో భారీగా నీరు నిలిచిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. నీటిని పూర్తిగా తొలగించిన తర్వాతే గని లోపలికి వెళ్లే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. జకార్తా శోధన, సహాయక సంస్థ అధిపతి డెసియానా కార్టికా బహారీ మాట్లాడుతూ.. గనిలో నీటి మట్టం ఇంకా తగ్గలేదని, నీటిని పూర్తిగా తోడేందుకు చాలా సమయం పడుతుందని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్