ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కూటమి ఎంపిలతో సిఎం టెలీకాన్ఫరెన్స్‌ - ఎంపి లకు కీలక ఆదేశాలు

8 గంటల క్రితం

CM holds teleconference with alliance MPs issues key directives to the MPs
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026, 03:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అమరావతి : పార్లమెంటులో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుల నేపథ్యంలో టిడిపి, జనసేన, బిజెపి కి చెందిన ఎంపి లతో ఎపి సిఎం చంద్రబాబు ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కీలక బిల్లులపై ఎంపి లకు దిశానిర్దేశం చేశారు. కూటమికి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరూ ఆదివారం సాయంత్రానికల్లా ఢిల్లీలో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. కూటమి నుంచి ఒక్క ఎంపి కూడా పార్లమెంటుకు హాజరుకాలేదనే మాట రాకూడదని, ప్రతి ఒక్కరూ ఈ రోజే ఢిల్లీకి చేరుకోవాలని ఎంపి లకు ముఖ్యమంత్రి సూచించారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ ... పార్లమెంటులో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు చర్చకు రావడం చారిత్రాత్మక సందర్భం అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గొప్ప సంకల్పంతో మహిళా రిజర్వేషన్ బిల్లును ముందుకు తీసుకెళుతున్నారని చెప్పారు. మహిళా శక్తిని చాటిచెప్పేలా ఈ బిల్లు ఆమోదం పొంది కొత్త చరిత్ర సృష్టిస్తుందని, ఇలాంటి చారిత్రక సందర్భంలో ప్రతి పార్లమెంట్ సభ్యుడు తన వంతు పాత్ర పోషించాలని స్పష్టం చేశారు. గతంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగిన సమయంలో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూశారని, తాజా డీలిమిటేషన్ ప్రక్రియలోనూ అన్ని రాష్ట్రాలకు 50 శాతం సీట్లు పెరిగేలా ప్రతిపాదనలు ఉన్నాయని అన్నారు. డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికీ నష్టం జరగదు అని చెప్పారు. సీట్ల పెంపును అన్ని వర్గాలు, రాజకీయ పార్టీలు స్వాగతించాలని సిఎం కోరారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్