ప్రజాశక్తి- ఏలూరు : ప్రముఖ యూట్యూబర్ ప్రశ్న రవణ్‌పై నమోదైన కేసులు, అరెస్టుల అంశంలో మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయని ఆరోపిస్తూ ఏలూరుకు చెందిన జి. రోనాల్డ్ రాజు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును కమిషన్ స్వీకరించి 15475/IN/2026 డైరీ నంబర్ కేటాయించింది. ఉప ముఖ్యమంత్రిన పవన్ కళ్యాణ్‌ను విమర్శించినందుకే ప్రశ్న రావణ్‌పై వరుసగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, పలుమార్లు అరెస్టు చేశారని, సంబంధం లేని భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్లను వర్తింపజేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రశ్న రావణ్ మానవ హక్కులు, రాజ్యాంగబద్ధ హక్కులను పరిరక్షించాలని కమిషన్‌ను కోరారు. కాగా... ప్రస్తుతం ఫిర్యాదు స్వీకరించి డైరీ నంబర్ కేటాయించినట్లు మాత్రమే కమిషన్ ధృవీకరించగా, విచారణకు స్వీకరించాలా లేదా అనే అంశంపై పరిశీలన అనంతరం తదుపరి చర్యలు చేపట్టనుంది.
ప్రశ్న రావణ్ వ్యవహారంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 05, 2026, 06:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)