ఆదివారం, 05 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

58 ఇంజనీరింగ్‌ కళాశాలల మూసివేత

3 గంటల క్రితం

up
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 05, 2026, 07:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్రలోనే అత్యధికం

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలల మూతపడ్డాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలలో అత్యధికంగా 12 చొప్పున మూతపడ్డాయి. ఆ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్, తెలంగాణ, పంజాబ్ ఉన్నాయి. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎఐసిటిఇ) నివేదిక ప్రకారం, వివిధ కారణాల వల్ల 2025-26 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్‌, టెక్నికల్‌ మూతపడ్డాయి. ఆయా కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సర విద్యార్థులను చేర్చుకోకూడదని, ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు తమ చదువును కొనసాగించి, డిగ్రీ పూర్తి చేయడానికి అనుమతిస్తారని ఎఐసిటిఇ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మూతపడిన 58 సంస్థల్లో మూడు ప్రభుత్వ కళాశాలలు కాగా, మిగిలినవన్నీ ప్రైవేటువే. మధ్యప్రదేశ్‌లో ఎనిమిది, తెలంగాణ, పంజాబ్‌లలో చెరో నాలుగేసి, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌లలో చెరో మూడు కళాశాలలు, గుజరాత్, కర్ణాటక, పూణే, తమిళనాడు, హర్యానా, ఒడిశా, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్‌లలో చెరో రెండు కళాశాలలు మూతపడ్డాయి. ఈ కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న టెక్నికల్‌, ఇంజనీరింగ్ కళాశాలల్లో 950కి పైగా కోర్సులను కూడా మూసివేసినట్లు సంబంధిత అధికారి తెలిపారు. దేశంలో సాంకేతిక విద్యకు సంబంధించిన చట్టబద్ధమైన జాతీయస్థాయి అత్యున్నత సలహా, నియంత్రణ సంస్థ అయిన ఎఐసిటిఇ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, మేనేజ్‌మెంట్, ఫార్మసీ రంగాల్లోని కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది. ఇది నాణ్యత హామీ, ప్రమాణాల నిర్వహణ, సమన్వయంతో కూడిన అభివృద్ధిని నిర్ధారిస్తుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్