ఆదివారం, 05 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

శిథిలావస్థలో కోటపోలూరు వాటర్ ట్యాంక్ .. పట్టించుకోని అధికారులు

3 గంటల క్రితం

water tank
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 05, 2026, 05:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - సూళ్లూరుపేట రూరల్ : తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం కోటపోలూరు గ్రామంలోని వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్యాంక్ ద్వారానే గ్రామానికి నిత్యం తాగునీటి సరఫరా జరుగుతుండటంతో, ప్రమాదం జరిగినా నీటి కొరత రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు. కొన్ని నెలలుగా ట్యాంక్ శిథిలావస్థలో ఉన్నప్పటికీ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఇప్పటివరకు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆర్ అండ్ బి రోడ్డుకు ఆనుకుని ఉన్న ట్యాంక్ ఎప్పుడు కూలిపోతుందోనని ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నిధులు కేటాయించినా అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలోని పంచాయతీల్లో కూడా తాగునీటి సమస్యల పరిష్కారానికి నిధులు వినియోగించడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సూళ్లూరుపేట మండలంలోని అన్ని వాటర్ ట్యాంకులను వెంటనే పరిశీలించి, ప్రమాదకర ట్యాంకుల స్థానంలో కొత్త ట్యాంకుల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్