- ముఖ్యమంత్రికి సిపిఐ లేఖ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని ప్రైవేటు విశ్వవిద్యాలయాల పనితీరు, ఆర్థిక లావాదేవీలు, విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్న ఫీజులు, ప్రభుత్వ భూముల కేటాయింపులు, రిజర్వేషన్ల అమలు తదితర అంశాలపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆదివారం ఆయన లేఖ రాశారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాలు నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నాయా లేదా అన్న అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ కోటా కింద ప్రవేశాలు పొందిన విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. 2022-23 నుంచి 2024-25 విద్యా సంవత్సరాల మధ్య ప్రభుత్వ కోటా విద్యార్థుల నుంచి రూ.26,17,52,872 అదనపు ఫీజుల రూపంలో వసూలు చేసినట్లు తెలిపారు. ఈ మొత్తాన్ని తిరిగి విద్యార్థులకు చెల్లించాలని సంబంధిత కమిషన్ ఆదేశించిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో గత ఐదేళ్లుగా వసూలు చేసిన ఫీజులు, ఆదాయ వ్యయాల వివరాలను పరిశీలించాలని కోరారు.








కామెంట్‌లు (0)