ఆదివారం, 25 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కృష్ణా నదిలో మునిగిన నాటుపడవ - ఇద్దరు యువకులు మృతి

2 గంటల క్రితం

Country boat sinks in Krishna River - Two youths dead
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026, 11:31 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

గుంటూరు : గుంటూరు జిల్లాలో విషాద‌క‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. తాడేపల్లి మండలం ప్రాతూరు వద్ద కృష్ణా నదిలో నాటుపడవ మునిగిన ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను అర్జున్ (17), హర్ష (18) గా గుర్తించారు. శనివారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రాతూరు గ్రామానికి చెందిన ఈశ్వర్, సందీప్, సంతోష్, అర్జున్, హర్ష అనే ఐదుగురు స్నేహితులు శనివారం సరదాగా నాటుపడవలో నదీపాయను దాటి వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న పడవలోకి నీరు చేరడంతో అది నదిలో మునిగిపోయింది. సందీప్, సంతోష్, ఈశ్వర్ ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరి ఈ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. అర్జున్, హర్ష నదిలో గల్లంతయ్యారు. ఘ‌ట‌న గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు గ్రామస్థుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టి, గల్లంతైన ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మృతులలో ఒకరైన హర్ష తాడికొండలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. దసరా సెలవుల కోసం స్వగ్రామానికి వచ్చి ఇలా మృత్యువాత పడటం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. హర్ష తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితమే మరణించినట్లు స్థానికులు తెలిపారు. అర్జున్ పదో తరగతి పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు జ‌రుపుతున్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్