అమరావతి : గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న సిపిఎం నేతలపై అక్రమంగా పెట్టిన కేసులను, రౌడీషీట్లను ఎత్తివేయాలని కోరుతూ ... మంగళవారం సిపిఎం నేతలు మంత్రి వంగలపూడి అనితను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఏలూరు జిల్లా ఏజెన్సీలో గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్న సిపిఎం పార్టీ నాయకులు తెల్లం రామకృష్ణ, అందుగుల ఫ్రాన్సిస్, తెల్లం దుర్గారావుల పై భూ స్వాములు, అధికారులు కుమ్మక్కయ్యి పెట్టిన అక్రమ కేసులను వెంటనే రద్దు చేయాలని, రౌడీ షీట్లను ఎత్తివేయాలని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత కు విన్నవించారు. ఇందుకుగాను మంత్రి సానుకూలంగా స్పందించి పరిశీలన చేసి సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు కామ్రేడ్ డి.రమాదేవి, పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి ఆర్ లింగరాజు, పార్టీ జిల్లా నాయకులు తెల్లం.రామకృష్ణ, బుట్టాయిగూడెం మండల నాయకులు పోలోజు నాగేశ్వరరావు పాల్గొన్నారు.
మంత్రి అనితను కలిసిన సిపిఎం నేతలు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 25, 2026, 11:25 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)